schedule Thursday, September 17, 2026

కాంగ్రెస్ గెలుపుకు సైనికుల్లా పనిచేయాలి

calendar_today November 20, 2023
person dharshininews
కాంగ్రెస్ గెలుపుకు సైనికుల్లా పనిచేయాలి
కాంగ్రెస్ గెలుపుకు సైనికుల్లా పనిచేయాలి - ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి - బూత్ లెవల్ కార్యకర్తలకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలకు కార్యకర్తలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ గెలుపుకోసం విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. అందరు హస్తం గుర్తుకు ఓటేసేలా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, నేతలు డాక్టర్ సంపత్ కుమార్, పి.బస్వరాజ్, అబ్దుల్ రవూఫ్, పట్లోళ్ల నర్సింలు, మురళీకృష్ణ గౌడ్, ప్రభాకర్ గౌడ్, మసూద్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల. యువనాయకులు తాండ్ర రాకేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22087/