schedule Wednesday, July 08, 2026

జనసేన గెలుపుకు బీజేపీ మద్దతు

calendar_today November 22, 2023
person dharshininews
జనసేన గెలుపుకు బీజేపీ మద్దతు
జనసేన గెలుపుకు బీజేపీ మద్దతు - బీజేపీ రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ బరిలో ఉన్న జనసేన పార్టీకి బీజేపీ తరుపున సంపూర్ణ మద్దతు అందించడం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు పటేల్ జయశ్రీ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరీ శంకర్ గౌడ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ నిర్ణయంలో భాగంగా బీజేపీ పొత్తులో జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. జనసేనకు బీజేపీ బలం తోడైతే విజయానికి మార్గం ఏర్పడుతుందని అన్నారు. బీజేపీ పార్టీ బలంతో జనసేన పార్టీకి మద్దతు ఇస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు జనసేన గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22120/