schedule Thursday, September 17, 2026

ముగింపు ప్రచారానికి ముమ్మర ఏర్పాట్లు

calendar_today November 27, 2023
person dharshininews
ముగింపు ప్రచారానికి ముమ్మర ఏర్పాట్లు
ముగింపు ప్రచారానికి ముమ్మర ఏర్పాట్లు - మండలాల్లో, పట్టణంలో బైక్ ర్యాలీలు - గ్రామాల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేయాలి - బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల ముగింపు ప్రచారానికి ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు తెలిపారు. సోమవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతో పాటు మండలాల్లో బైకు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బషీరాబాద్ మండలంలో, 11 గంటలకు యాలాల మండలంలో, 12 గంటలకు కోట్ పల్లి, 1 గంటలకు పెద్దేముల్, 2 గంటలకు కరణ్ కోట్, 3 గంటలకు తాండూరు పట్టణంలో బైకు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి మండలంలో 500ల బైకులతో ర్యాలీలు చేపట్టాలని, పట్టణంలోని ప్రతి వార్డు నుంచి 100 బైకులతో ర్యాలీలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో డమ్మీ ఈవీఎంలు ప్రదర్శిస్తూ ప్రచారం చేపట్టాలన్నారు. 29వ తేదిన జెండాలు ప్రదర్శించకుండా ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22287/