schedule Wednesday, July 08, 2026

చిరస్మరణీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే

calendar_today November 28, 2023
person dharshininews
చిరస్మరణీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే
చిరస్మరణీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే - బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ - వర్ధంతిలో నివాళులు అర్పించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కుల నిర్మూలన కోసం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే ఎప్పటికి చిరస్మరణీయుడుగా నిలుస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూల వర్ధంతిని నిర్వహించారు. రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో కుల వ్యతిరేకతను రూపుమాపేందుకు మహాత్మ జ్యోతిరావు పూలు కృషి చేసిన సంఘ సంస్కర్త అని అభివర్ణించారు. ఆయన ఆశయ సాధనకు అందరు ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ కార్యదర్శి అనిత, మీడియా ఇంచార్జ్ బసవరాజు, బీసీ యువనాయకులు రాము ముదిరాజ్, హరి ప్రసాద్, జుంటుపల్లి వెంకట్, ఎల్లప్ప, అనిల్, సాయి, నవీన్, సోను, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22301/