schedule Thursday, September 17, 2026

తాండూరులో ఓటింగ్‌ షురూ..!

calendar_today November 30, 2023
person dharshininews
తాండూరులో ఓటింగ్‌ షురూ..!
తాండూరులో ఓటింగ్‌ షురూ..! - ఓట్లేసేందుకు బారులు తీరుతున్న జనం - హక్కు వినియోగించుకోనున్న తొలి ఓటర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓటింగ్ షురూ అయ్యింది. పట్టణంలోని అన్ని కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. పట్టణంలోని ఓటర్లు ఉత్సహాంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. అధికారులు అందించిన ఓటర్ స్లిప్పులతో పాటు గుర్తింపు కార్డులో వచ్చి ఓటు వేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు ఇతర పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల నుంచి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. అయితే ఈ సారి తాండూరులో యువకులు కొత్తగా నమోదు చేసుకున్న ఓటు హక్కుతో తొలిసారి ఓటు వేయబోతున్నారు. తాండూరు పట్టణంలోని గాంధీనగర్‌లో బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు తన కుమారుడితో కలిసి ఓటు వేశారు. ఆయన కుమారుడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి హక్కును వినియోగించుకున్నారు. ఇదే వాతావరణంలో పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలలో కనిపిస్తోంది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22330/