పేదింట్లో పండగ సంతోషం
October 14, 2021
dharshininews
పేదింట్లో పండగ సంతోషం నింపిన జనచైతన్య యువజన సంఘం
- తాండూరులో పేదలకు పండగ సామాగ్రి, బట్టల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని నిరుపేదల ఇండ్లలో జనచైతన్య యువజన సంఘం సంతోషాన్ని నింపింది. గురువారం పట్టణంలోని పలువురు పేదలకు పండగ సామాగ్రితో పాటు బట్టలను పంపిణీ చేసింది. స్థానిక ఆర్యసమాజ్ కార్యాలయంలో తాండూరు బీసీ సంఘము నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ చేతుల మీదుగా సామాగ్రిని, బట్టలను వితరణ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ 2014లో మొదటి సారి జన చైతన్య యువజన సంఘం చేపట్టిన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. తాజాగా నవరాత్రి, దసరా పండగ సందర్భంగా హిందువులకు పండగ సామాగ్రిని, బట్టలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. సేవా కార్యక్రమాలను చేపడుతున్న జనచైతన్య యువజన సంఘాన్ని అభినందించారు. సంఘం చేసే సేవా కార్యక్రమాలకు తనవంతు సహాకారం ఉంటుందన్నారు. అదేవిధంగా సంఘం సభ్యులు రాఘవేందర్, రఘు, జుంటుపల్లి వెంకట్‌లు మాట్లాడుతూ పేదలకు సహాయం చెయ్యడానికి జనచైతన్య యువజన సంఘం ముందుంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు వినోద్ కుమార్, జేటపగ నరేష్, మొగులయ్య, రాము ముదిరాజ్, టైలర్ రమేష్, అంబాదస్, లక్ష్మయ్య, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.