శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు
November 5, 2021
dharshininews
శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు
- మొక్కులు తీర్చుకున్న వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం నుంచి అయ్యప్ప మాల ధరించిన స్వాములు శబరికి బయల్దేరారు. శుక్రవారం ఆలయం నుంచి బయల్దేరి వెళ్లారు. ఆలయ కమిటి ఆధ్వర్యంలో వరాల శ్రీనివాస్ రెడ్డి(కౌన్సిలర్), పట్లోళ్ల గంగాధర్, సంపల్లి శ్రీను, పట్లోళ్ల ప్రశాంత్, గోపాల్ గురు స్వామి, వరంగల్ అశోక్ గురు స్వామి, రాము, శ్రీనివాస్ రెడ్డి, చంద్రు, రుద్రు పటేల్, బస్వరాజ్, అజయ్, సునీల్ తదితరులు శబరికి పాదయాత్ర చేపట్టారు. ముందుగా అయ్యప్ప
స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి పాదయాత్రగా బయల్దేరిన అయ్యప్ప స్వాములను మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల నర్సింలు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో స్వాములు, భక్తులు అయ్యప్ప నామస్మరణలో ముందుకు సాగారు. యాత్రలో అయ్యప్ప కీర్తనలతో స్వామి నామస్మరణను మార్మోగించారు. మరోవైపు ఆలయం నుంచి బయల్దేరిన ఈ స్వాముల పాదయాత్ర 37 రోజుల పాటు 1200 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని ఆలయ కమిటి సభ్యులు తెలిపారు.