schedule Saturday, July 11, 2026

రైతు బంధుకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

calendar_today December 1, 2021
person dharshininews
రైతు బంధుకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి
రైతు బంధుకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి - తాండూరు మండ‌ల ఏఓ ర‌జిత తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తాండూరు మండ‌ల వ్య‌వ‌సాయ శాఖ అధికారిణి ర‌జిత అన్నారు. బుధ‌వారం తాండూరు వ్య‌వసాయ శాఖ కార్యాల‌యంలో ఆమె మాట్లాడుతూ కొత్త‌గా పాసు పుస్త‌కాలు పొందిన రైతుల నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న రైతుబంధు పథకం కోసం దరఖాస్తులను స్వీకరించడం జ‌రుగుతుంద‌ని తెలిపారు. పాసు పుస్త‌కాలు పొందిన వారితో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు దరఖాస్తు చేయనివారు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్ తీసుకొచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్దిదారులకు ఉండాల్సిన అర్హతలు: - తెలంగాణ నివాసి అయివుండాలి. ఈ పథకం తెలంగాణ రైతులకు మాత్రమే వర్తిస్తుంది. - భూమికి యజమాని అయివుండాలి. సొంత భూమి కాని వారికి ఈ పథకం వర్తించదు. - తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పథకంలో చేరేందుకు ఇవ్వాల్సిన పత్రాలు: - ఆధార్ కార్డు (Aadhar Card), ఓటర్ ఐడీ కార్డు (Voter ID card) కలిగి ఉండాలి. - బీపీఎల్ సర్టిఫికెట్ (BPL certificate) - దీని ద్వారా రైతు తాను దారిద్ర్య రేఖకు దిగువన వున్నట్లు నిరూపితం అవుతుంది. - భూమి తనదే అని నిరూపించే యాజమాన్య హక్కు పత్రాలు కలిగివుండాలి. - రైతు ఎస్సీ, ఎస్టీ, బీడబ్ల్యూకి చెందిన వారా అనేది తెలుసుకోవడానికి కుల ధ్రువీకరణ పత్రం కలిగివుండాలి. - స్థానిక అడ్రెస్ ఫ్రూవ్ అవసరం. - బ్యాంక్ అకౌంట్ కలిగివుండాలి.