schedule Saturday, July 11, 2026

అయ్య‌ప్ప‌ ప‌డిపూజ‌కు త‌ర‌లిరండి

calendar_today December 13, 2021
person dharshininews
అయ్య‌ప్ప‌ ప‌డిపూజ‌కు త‌ర‌లిరండి
అయ్య‌ప్ప‌ ప‌డిపూజ‌కు త‌ర‌లిరండి - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఈనెల 15న నిర్వ‌హిస్తున్న శ్రీ ధ‌ర్మ‌శాస్త్ర అయ్య‌ప్ప స్వామి మ‌హా ప‌డిపూజ‌కు స్వాములు, భ‌క్తులు త‌ర‌లిరావాల‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి యేడాది మాదిరిగానే ఎల్లుండి 15న తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల మైదానంలో ప‌డిపూజ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు నిర్వ‌హించే ప‌డి పూజ మ‌హోత్స‌వానికి మాల ధరించిన అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప స్వామి అనుగ్రహమునకు పాత్రులు కాగలరని మనవి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరారు. [video width="352" height="640" mp4="https://dharshininews.com/wp-content/uploads/2021/12/ayyappa-pooja.mp4"][/video]