schedule Saturday, July 11, 2026

ఉర్దూ మీడియం అద్యాప‌కులు కావాలి

calendar_today December 16, 2021
person dharshininews
ఉర్దూ మీడియం అద్యాప‌కులు కావాలి
ఉర్దూ మీడియం అద్యాప‌కులు కావాలి - తాండూరు ఆర్డీఓ కార్యాల‌యం ముందు ఆందోళ‌న - విన‌తిప‌త్రం అందించిన ఏఐపీసీ, మైనార్టీ సభ్యులు ఖాలీద్ సఫీవుల్లా తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాలలో అద్యాప‌కులు కావాలంటూ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్(ఏఐపీసి), తాండూరు కాంగ్రెస్ మైనార్టీ సభ్యులు మహమ్మద్ ఖాలీద్ షఫీవుల్లా డిమాండ్ చేశారు. గురువారం మైనార్టీ విద్యార్థులతో కలిసి తాండూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాలలో అద్యాపకులు లేక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. కళాశాలలో ఒకే ప్రవేటు లెక్చర‌ర్‌ను మాత్రమే నియమించారని గుర్తుచేశారు. అట్టి అధ్యాపకుడు ఉర్దూ పాఠ్యాంశాలను బోధించకపోవడంతో విద్యార్థుల చ‌దువుల‌కు న్యాయం జ‌ర‌గ‌డంలేద‌ని అన్నారు. ప్రతి యేడాది ఇదే సమస్యపై డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఉర్దూ భాష, ఉర్దూ మీడియం విద్యార్థులపై ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనంతరం సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాండూరు ఆర్డీట అశోక్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్జీ నాయకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు