schedule Saturday, July 11, 2026

స‌ల్లంగా దీవించు రేణుకా ఎల్లమ్మ తల్లి..!

calendar_today December 24, 2021
person dharshininews
స‌ల్లంగా దీవించు రేణుకా ఎల్లమ్మ తల్లి..!
స‌ల్లంగా దీవించు రేణుకా ఎల్లమ్మ తల్లి..! - వైభోగంగా రేణుకా నాగ ఎల్లమ్మ జాతర ఉత్సవాలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ జాతర ఉత్సవాలు: శుక్రవారం వైభవంగా జరిగాయి. పట్టణ మహిళలు, భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని జీవితకాలమంతా సల్లంగానూడూ.. తల్లి అంటూ వేడుకున్నారు. అదే విధంగా జాతర ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. జాతర సందర్భంగా భక్తుల కొంగుబంగారంగా మారిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. అంతేకాకుండా మహిళలు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి బోనాల ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది. అదే విధంగా కోరిన కోర్కెలు నెరవేరాయని అమ్మవారికి కోడి పుంజులను తీసుకవచ్చి ఆలయం చుట్టు ప్రదక్షణలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా తాండూరుకు చెందిన వివిధ పార్టీల నేతలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దరి పెంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు నేడు శనివారం జాతర ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటి సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, హమాలీ కార్మిక సంఘం నేతలు. భక్తులు తదితరులు పాల్గొన్నారు.