అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ
December 29, 2021
dharshininews
అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ
- పడిపూజలో పాల్గొన్న పట్నం రినీష్ రెడ్డి
- పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి
- నామస్మరణతో మార్మోగిన అయ్యప్ప ఆలయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని అయ్యప్పస్వామి ఆలయం బుధవారం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునితామహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆలయంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, సునితామహేందర్ రెడ్డిల కుమారుడు రినీష్ రెడ్డి పాల్గొన్నారు. గురు స్వాములు నీష్ రెడ్డి చేత పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ స్వామి విగ్రహానికి పంచామ్రుతాలతో అభిషేకం చేశారు. అనంతరం జరిగిన మెట్ల పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. పూజ సమయంలో ఆలయం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో దద్దరిల్లింది.
పూజా కార్యక్రమంలో భాగంగా గురుప్వాములు పాడిన అయ్యప్ప గీతాలతో ఆలయ ప్రాగణం భక్తిభావంతో పొంగిపొర్లింది. స్వామివారి పల్లకిసేవ, స్వాముల నృత్యాలు కన్నుల పండగలా జరిగాయి. ఈ పడిపూజకు అయ్యప్పస్వామి భక్తులు కుటుంబ సమేతంగా తరలిరావడంతో ఆలయం పూర్తిగా నిండిపోయింది. ఆలయ కమిటీ సభ్యులు, ఇతర స్వాములు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పూజ అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు మహేందర్రెడ్డితో పాటు సతీమణి సునితారెడ్డి, కుమారుడు రినీష్ రెడ్డిలు స్వయంగా అన్నదానం చేశారు.
ఈ పూజకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాందాస్, యాలాల మండల అధ్యక్షులు మల్లారెడ్డి, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సిద్రాల శ్రీనివాస్, రవీందర్, అజయ్ ప్రసాద్. సిరిగిరిపేట్ పండరి, బంటు మల్లప్ప, బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాని, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి,
కౌన్సిలర్ విజయాదేవి, మహిళ నాయకురాలు నర్మదారెడ్డి, తాండూరు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్, వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు రాంరెడ్డి, వీరశైవ సమాజం సభ్యులు తంబాకు చంద్రశేఖర్, గాజుల శాంతుకుమార్, బంటారం భద్రేశ్వర్, బీసీ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, కౌన్సిలర్లు రవి, వెంకన్నగౌడ్, టీఆర్ఎ స్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.