schedule Saturday, July 11, 2026

రోడ్డు విస్తరణకు మోక్షం..!

calendar_today January 11, 2022
person dharshininews
రోడ్డు విస్తరణకు మోక్షం..!
రోడ్డు విస్తరణకు మోక్షం..! - ఇందిరా చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు పనులు ప్రారంభం - టెంకాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ చౌరస్తా వరకు నిలిచిపోయిన రోడ్డు విస్తరణకు మోక్షం లభించింది. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈ విస్తరణ పనులను ప్రారంభించారు. రైల్వేస్టేషన్ రోడ్డు మార్గంలోని ఎంఐఎం అధ్యక్షులు హాది భవనం వద్ద ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. రైల్వే స్టేషన్ వద్ద నుంచి ఇందిరా చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లి పలు దుకాణ యజమానులతో మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనులకు అందరు సహకరించాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకోనని ముందుకొచ్చిన హాది భవనం నుంచి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్ఫూ(నయూం), మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, బంటారం సుధాకర్, ఆర్డీఓ అశోక్ కుమార్, నాయకులు, అధికారులు ఉన్నారు.