schedule Saturday, July 11, 2026

క్రీడలతో స్నేహపూర్వక వాతావరణం

calendar_today January 13, 2022
person dharshininews
క్రీడలతో స్నేహపూర్వక వాతావరణం
క్రీడలతో స్నేహపూర్వక వాతావరణం - మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల దీపా నర్సింలు - తాండూరులో బిగ్ బ్యాష్ -7 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : క్రీడలతో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడుతుందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. గురువారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బిగ్ బ్యాష్ సీజన్ -7 క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు ముఖ్య అతిథిగా హజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొనే వారు చివరి వరకు పోరాటం చేస్తారని, అలాంటి స్పూర్తిని జీవితంలో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ప్రదర్శించాలన్నారు. క్రీడలతో శారీరక ధారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు క్రీడల వల్ల స్నేహపూరిత వాతావరణం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఖాన్, రాజు గౌడ్, సమద్, కౌన్సిలర్ అబ్దుల్ రజాక్, వైశ్య ఫెడరేషన్ జిల్లా ప్రెసిడెంట్ రొంపల్లి సంతోష్ కుమార్, టోర్నమెంట్ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.