ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు
January 13, 2022
dharshininews
ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తాండూరు కాంగ్రెస్ నాయకులు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. గురువారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌లో శ్రీ దేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, 25 వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, ఎన్ఎస్‌యూఐ తాండూరు అధ్యక్షులు సందీప్ రెడ్డి తదితరులు ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలో వెలసిన సతీసమేత శ్రీ శ్రీదేవి, భూదేవి, శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సదంర్భంగా తాండూరు ప్రజలను సల్లంగా చూడాలని శ్రీవారిని వేడుకున్నారు. కరోనా, ఓమిక్రాన్ నుంచి ప్రజలను కాడాపాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.