రేపు భోగి.. ఎల్లుండి సంక్రాంతి
January 13, 2022
dharshininews
రేపు భోగి.. ఎల్లుండి సంక్రాంతి
- వెల్లడించిన వేద పండితులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దక్షిణ భారతదేశంలో తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతిపై ప్రజలు ఆయోమయంలో ఉన్నారు. పండగను ఏరోజు జరుపుకోవాలనే సందిగ్దంలో ఉన్నారు. అయితే దీనిపై పంచాంగ కర్తలు, వేద పండితులు స్పష్టత ఇచ్చారు. రేపు భోగి పండగను, ఎల్లుండి శనివారం మకర సంక్రాంతి జరుపుకోవాలని సూచించారు. 14న భోగి రోజు రొట్టెల పండగ జరుపుకోవాలని తెలిపారు. అదేరోజు పిల్లలకు భోగిపండ్లు వేసుకోవచ్చన్నారు. 15వ తేదిన మకర సంక్రమణం, పర్వకాలం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల రకు ఉంటుందన్నారు. ఈ రోజునే మకర సంక్రాంతి పండగను జరుపుకోవాలన్నారు. మరుసటి రోజు 15వ తేదిన కనుమ కరి పండగను జరుపుకోవాలన్నారు. ఇప్పటికే పండగ కోసం ప్రజలు ఏర్పాట్లను చేసుకున్నారు. పండగపై క్లారీటి రావడంతో ప్రజలు పండగను జరుపుకునేందుకు సిద్దమయ్యారు.