schedule Saturday, July 11, 2026

పాదయాత్ర భక్తులకు అన్నదానం

calendar_today January 19, 2022
person dharshininews
పాదయాత్ర భక్తులకు అన్నదానం
పాదయాత్ర భక్తులకు అన్నదానం - ఊధారతను కొనసాగిస్తున్న శంకర్ యాదవ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నుంచి శ్రీశైలం శైవక్షేత్రానికి బయల్దేరిన భక్తులకు తాండూరు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ అన్నదానం చేశారు. బుధవారం తాండూరు మండల మాజీ వైస్ ఎంపీపీప శేఖర్ ఆధ్వర్యంలో తాండూరుకు చెందిన శివభక్తులు పాదయాత్రగా శ్రీశైలానికి బయల్దేరారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మార్గమద్యలోని ఎరన్పల్లి వద్ద భక్తులను కలుసుకున్నారు. పాదయాత్రగా ఆ ప్రాంతానికి చేరుకున్న 80 మంది శివ భక్తులకు శంకర్ యాదవ్ అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి యేడాది పాదయాత్రగా వెళ్లే భక్తుల కోసం శంకర్ యాదవ్ అన్నదానం చేస్తున్నారు. ఈ యేడాది కూడ అన్నదానం ఏర్పాటు చేసి ఊదారతను కొనసాగిస్తున్నారు. అనంతరం శంకర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా వెళుతున్న భక్తులు క్షేమంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్, సన్నిహితులు బంటు మల్లప్ప, జొన్నల వినోద్ కుమార్, మనోహర్ యాదవ్, కేశవరావు, దర్మీది రవి, విశ్వనాథ్ పూరీ బస్వరాజ్ తదితరులు ఉన్నారు.