schedule Saturday, July 11, 2026

సల్లంగా దీవించూ రక్తమైసమ్మా తల్లీ..!

calendar_today January 30, 2022
person dharshininews
సల్లంగా దీవించూ రక్తమైసమ్మా తల్లీ..!
సల్లంగా దీవించూ రక్తమైసమ్మా తల్లీ..! - ఘనంగా బోనాల‌ జాతర ఉత్సవాలు - దర్శించుకున్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణం మర్రిచెట్టు కూడలిలో భక్తుల కొంగుబంగారంగా కొలుస్తున్న శ్రీ రక్తమైనమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. జాతర ఉత్సవాల సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. పలు వీదుల్లో ప‌ల్ల‌కిసేవ‌ ఊరేగింపు భాయమానంగా కొనసాగింది. ఈ ప‌ల్ల‌కిసేవ ఊరేగింపులో మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్ పాల్గొన్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అమ్మవారిని దరి ఎంచుకుని పూజలు నిర్వహించారు. అనంతరం తాండూరు ప్రజలను సల్లంగా దీవించాలని వేడుకుకున్నారు. అంతేకాకుండా జాతర ఉత్సవాల సందర్భంగా మహిళలు బోనాలతో ఆలయానికి తరలివచ్చారు. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణానికి చెందిన నేతలు, గంజ్ వ్యాపారులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతర ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు.