schedule Wednesday, September 09, 2026

గాంధీ ఆశ‌యాల‌ను నెర‌వేర్చాలి

calendar_today January 30, 2022
person dharshininews
గాంధీ ఆశ‌యాల‌ను నెర‌వేర్చాలి
గాంధీ ఆశ‌యాల‌ను నెర‌వేర్చాలి - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మగాంధీజీ ఆశ‌యాల‌ను అంద‌రు నెర‌వేర్చాల‌ని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గాంధీ వర్ధంతి వేడుకలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పాల్గొన్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి చైర్ పర్సన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాలను, కన్న కలలను నిజయం చేసేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ రాజలింగం, సభ్యులు కోస్తి తిప్పయ్య, కుంచెం మురళీదర్ తదితరులు పాల్గొన్నారు.