సమాజ శ్రేయస్సుకే సమతా సహస్రాబ్ది ఉత్సవాలు
February 5, 2022
dharshininews
సమాజ శ్రేయస్సుకే సమతా సహస్రాబ్ది ఉత్సవాలు
- సమారోహంలో పాల్గొన్న గీత తత్సంగ్ సమితి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ శ్రేయస్సుకు సమతా సహస్రాబ్ది ఉత్సవాలు దోహదపడతాయని తాండూరు గీతా తత్సంగ్ సమితి సభ్యులు అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణ కొనసాగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలలో తాండూరు గీతా తత్సంగ్ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాలలో తమవంతు సేవలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమతా సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం మహాద్భాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సుకు సమతా సహస్రాబ్ది ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు.