schedule Wednesday, September 09, 2026

హిజాబ్‌పై రాద్దాంతం తగదు

calendar_today February 6, 2022
person dharshininews
హిజాబ్‌పై రాద్దాంతం తగదు
హిజాబ్‌పై రాద్దాంతం తగదు - బాలికల హక్కుల ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు - టీపీసీపీ మైనార్టీ ఉపాధ్యక్షులు ఖాలీద్ సైఫుల్లా తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వ్యవహారంపై రాద్దాంతం సృష్టించడం తగదని తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ మైనార్టీ ఉపాధ్యక్షులు ఖాలీద్ సైఫుల్లా అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ ధరించి స్కూళ్లు, కాలేజీలలోకి వచ్చే ముస్లిం బాలికలను అడ్డుకున్న వివాదాల‌ను ఆయన ఖండించారు. ఆదివారం తాండూరులో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో హిజాబ్ పై రాద్దాంతం సృష్టించడం మంచిది కాదన్నారు. ప్రజా స్వామ్యంలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్నారు. హిజాబ్ ధరించి స్కూళ్లు, కాలేజీలకు వస్తే అడ్డుకోవడం బాలికల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఈ వివాదాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటకలో ఇంత రాద్దాంతం జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం, ప్ర‌ధాని మోడి స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ఈ వివాదాన్ని పరిష్కరించి.. ప్రజా స్వామ్యంలో హక్కులను కాపాడాలన్నారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ నయూం, కాంగ్రెస్ పార్టీ తాండూరు మైనార్టీ అధ్యక్షులు ఖాజా రియాజోద్దీన్, యూత్ లీడర్ మహమ్మద్ ఓవైస్ తదితరులు పాల్గొన్నారు.