schedule Saturday, July 11, 2026

16న ద‌స్త‌గిరిపేట్‌లో శ్రీ‌వారి జాత‌ర

calendar_today February 14, 2022
person dharshininews
16న ద‌స్త‌గిరిపేట్‌లో శ్రీ‌వారి జాత‌ర
16న ద‌స్త‌గిరిపేట్‌లో శ్రీ‌వారి జాత‌ర - క‌ళ్యాణోత్స‌వం, ర‌థోత్స‌వ వేడుక‌లు తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మండ‌లం అంతారం అనుబంధ గ్రామం ద‌స్త‌గిరిపేట్‌లోని శ్రీ శ్రీ‌దేవి భూదేవి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో శ్రీ‌వారి క‌ళ్యాణోత్స‌వానికి ముస్తాబ‌య్యింది. ఆల‌య వార్షికోత్స‌వ ఉత్స‌వాల‌లో భాగంగా 16న బుధ‌వారం శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వేంకేట‌శ్వ‌ర స‌మేత క‌ళ్యాణోత్స‌వం నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య అర్చకులు అర్చకులు, ధర్మకర్తలు, పురందరాచార్ శుక్రవార్ తెలిపారు. క‌ళ్యాణోత్స‌వం అనంత‌రం స్వామి వారి ర‌థోత్సవం జ‌రుగుతుంద‌ని చెప్పారు. దీంతో పాటు సాయంత్రం శ్రీవారి అశ్వవాహన సేవ , ఉయ్యాల సేవ, మహా మంగళహారతి, స్వస్తి వచనము కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. కావున శ్రీవారి భక్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అధిక సంఖ్య‌లో పాల్గొని స్వామి వారి పరమానుగ్రహమునకు పాత్రులు కాగలరని విజ్ఞ‌ప్తి చేశారు.