schedule Saturday, July 11, 2026

కరాటే పోటీలో మెరిసిన తాండూరు క్రీడాకారులు

calendar_today February 14, 2022
person dharshininews
కరాటే పోటీలో మెరిసిన తాండూరు క్రీడాకారులు
నేషనల్ కరాటే పోటీలో మెరిసిన తాండూరు క్రీడాకారులు - బంగారు, వెండి, కాంశ్య ప‌త‌కాలు సొంతం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : హైదరాబాద్ లో జరిగిన నేషనల్ కరాటే పోటీలలో తాండూరు క్రీడాకారులు సత్తా చాటారు. బంగారు, వెండి పతకాలతో మెరిశారు. సీఎం కేసీఆర్ నేషనల్ కరాటే, కుంగ్-ఫూ చాంపియన్ షిప్-2022 పేరుతో నిర్వ‌హించిన పోటీలో బి.జశ్వంత్, కె. హర్షిత, బి. మణికంఠలు ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచి బంగారు పతకాలు సాధించారు. అదేవిధంగా బి.జశ్వంత్, కె.అనూష వెండి పతకాలు సాధించారు. ఎండీ అరుణ్ అలీ, పి.సిద్దార్థ్, కె.సాయి, ఇ. విష్ణులు కాంస్య పథకాలను సాధించారు. పోటీలలో సత్తాచాటిన క్రీడాకారులను మాస్టర్ బీవీ సాయికుమార్, జూనియర్ మాస్టర్ బీవీ మోహన్ కృష్ణలు అభినదించారు.