గుట్టను గుడి చేసిన పరమదాసు అస్తమయం
February 18, 2022
dharshininews
గుట్టను గుడి చేసిన పరమదాసు అస్తమయం
- అనారోగ్యంతో కన్నుమూసిన భక్తుడు
- సంతాపం తెలిపిన నాయకులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : భద్రాద్రిలో రాముడుకు గుడి కట్టించిన రామదాసులాగే వికారాబాద్ జిల్లాలో శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామికి గుడి కట్టిన పరమ భక్తులు పరమదాసు(88) అస్తమించారు. వికారాబాద్ జిల్లాలో పరమదాసు గుట్టను గుడిగా మలిచిన భక్తుడుగా గుర్తిండిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత యాభై ఏళ్ల క్రితం మోమిన్పేట్ మండలం వెలిశాల గ్రామ సమీపంలో గుట్టగా ఉన్న ప్రాంతాన్ని తన సొంత చేతితో ఆలయంగా తీర్చిదిద్దారు పరమదాసు. గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించిచారు. లక్ష్మీ నర్సింహాస్వామితో పాటు బద్రీనాథేశ్వరస్వామి, మల్లిఖార్జునస్వామి, ఆంజనేయ స్వామి, నాగేశ్వర స్వామి.. వేరువేరు ఆలయాలను రూపొందించి గుట్టకు ఆధ్యాత్మిక శోభను తీసుకవచ్చారు. తాజాగా మరణంతో వెలిశాలో విషాదం నిండుకుంది. పరమదాసు మరణం పట్ల పలువురు నాయకులు, భక్తులు సంతాపం తెలిపారు. పరమ భక్తునికి స్వర్గప్రాప్తి కలగాలని ప్రార్ధించారు. ఇంకా వుంది.. కింద చూడండి
వెలిశాలలో పరమదాసు నిర్మించిన దేవాలయం...