రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
February 19, 2022
dharshininews
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
- ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు ఆదివారం తాండూరు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు తాండూరు విద్యుత్ డీఈ వెంకన్న ఓ ప్రకటలో తెలిపారు. తాండూరు మున్సిపల్, తాండూరు మండలంలోని గౌతాపూర్, పెద్దేముల్, యాలాల మండలంలోని కోకట్, బాగాయిపల్లి గ్రామాలతో పాటు కోట్‌పల్లి, బంట్వారం మండలంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ఆయా గ్రామాల్లోని 220/132/33 కేవీ సబ్ స్టేషన్లల పరిధిలో నిర్వహణ పనులను దృష్టిలో ఉంచుకుని అంతరాయం విధిస్తున్నట్లు వివరించారు. కావున వినియోగదారులు విద్యుత్ అంతరాయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.