జీతాలివ్వకుంటే సమ్మె తప్పదు
March 22, 2022
dharshininews
పెంచిన జీతాలివ్వకుంటే సమ్మె తప్పదు
- ఆర్డీఓకు నోటీసు అందించిన మున్సిపల్ కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జీతాలు చెల్లించండి మహాప్రభో అంటూ ఇన్నాళ్లు మొరపెట్టుకున్న తాండూరు మున్సిపల్ కార్మికులు సమ్మె బాటకు సిద్ధమవుతున్నారు. మంగళవారం తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ కు ఏఐటీయూసీ తాండూరు మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు.
అనంతరం మున్సిపల్ ముందు నిరసన చేపట్టిన కార్మిక నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీని ప్రకటించి వేతనాలను పెంచిందని గుర్తుచేశారు. అన్ని మున్సిపల్లో కార్మికులకు 11వ పీఆర్సీ అమలవుతున్నా తాండూరు మున్సిపల్ కార్మికులకు అమలు చేయడం లేదని విమర్శించారు. పెంచిన జీతాలతో పాటు గత రెండు నెలలుగా పాత వేతనాలు కూడా అందించడం లేదని అన్నారు. వేతనాల అంశం కోర్టులో ఉందని అధికారులు, పాలకవర్గం పట్టించుకో వడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రత్యేక సమావేశం పెట్టి సమస్యను పరిష్కరించాలని విన్నవించినా స్పందన కరువైందన్నారు. ఈ నేపథ్యంలో పెంచిన వేతనాలు, పాత జీతాల సమస్య పరిష్కరించకుంటే వచ్చే నెల 6న సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం. గోపాల్, జే. గో పాల్, నాయకులు అశోక్, రాములు, వెంకటప్పు, నాగప్ప, తదితరులు పాల్గొన్నారు.