schedule Saturday, July 11, 2026

మిషన్ భగీరథ ఆదర్శం

calendar_today March 24, 2022
person dharshininews
మిషన్ భగీరథ ఆదర్శం
మిషన్ భగీరథ ఆదర్శం - రెండేళ్లలో తాండూరును అభివృద్ధి చేస్తాం - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ కౌన్సిలర్ విజయదేవి ఆధ్వర్యంలో పట్టణంలోని పోట్లీ మహారాజ్ దేవాలయంలో నిర్మించిన మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేవాలయ ఆవరణ ప్రజలకు కొత్తగా ఇచ్చిన కనెక్షన్ ద్వారా నీటి కుళాయిని తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్ కృషితో ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వచ్చే రెండేళ్లలో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మాజీ చైర్మన్ విశ్వనాధ్ గౌడ్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, ముక్తార్ నాజ్, సోమశేఖర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు రంగారావు, ప‌ట్లోళ్ల‌ నర్సింలు,రాజుగౌడ్, శ్రీనివాస్ చారి, దేవాలయ చైర్మన్ రాజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.