schedule Wednesday, September 09, 2026

బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మఠం చంద్రశేఖర్

calendar_today March 26, 2022
person dharshininews
బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మఠం చంద్రశేఖర్
బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మఠం చంద్రశేఖర్ - తాండూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. శనివారం తాండూరు కార్యాలయంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఆసోసియేషన్ అధ్యక్షులుగా మఠం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా పి.మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్.రవీందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా బి.రజిత, కోశాధికారిగా నాదిర్గే సుదర్శన్లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు విజయ్ కుమార్ తిరుమల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా మొత్తం 58 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించే చందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం న్యాయవాదులు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, భవనప్ప, బాలి శివకుమార్, బాలి రాజశేఖర్, పి.శ్రీనివాస్, పి. రాంరెడ్డి, పి.నర్సింలు, నర్సింగ్ రావు, విశ్వనాథ్, చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్ గౌడ్, బి.రవికుమార్, అనితా గుప్తా, మహమ్మదీ భేగం, సోఫియా తదితరులు పాల్గొన్నారు.