తిమ్మాయిపల్లిలో తాగునీటీ తంటాలు
March 27, 2022
dharshininews
తిమ్మాయిపల్లిలో తాగునీటీ తంటాలు
- ట్యాంకర్లతో నీటి సరఫరా చేయించిన వార్డు సభ్యులు
యాలాల, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం తిమ్మాయిపల్లిలో ప్రజలు తాగునీటికి తంటాలు పడుతున్నారు. మూడు రోజులుగా గ్రామానికి నీటి సరఫరా స్థంభించి పోయింది. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి సర్పంచ్ లేక పోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ప్రజలు వార్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో యు.జగదీశ్వర్ స్పందించి తన సొంత ట్యాంకర్‌తో గ్రామంలోని ఎస్సీ కాలనీకి తాగునీటికి సరఫరా చేయించారు. ఇందుకు కాలనీ ప్రజలు వార్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతున్నారు.