schedule Saturday, July 11, 2026

రేపు విద్యుత్ అంత‌రాయం

calendar_today April 23, 2022
person dharshininews
రేపు విద్యుత్ అంత‌రాయం
రేపు విద్యుత్ అంత‌రాయం - పెద్దేముల్, కోట్‌ప‌ల్లి, బార్వాద్‌ల‌లో నిలిపివేత‌ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో రేపు విద్యుత్ అంత‌రాయం విధిస్తున్న‌ట్లు విద్యుత్ ఏఈ సందీప్ కుమార్ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. నియోజ‌కవ‌ర్గంలోని పెద్దేముల్, కోట్‌ప‌ల్లి, బార్వాద్ విద్యుత్ స‌బ్ స్టేష‌న్‌ల ప‌రిధిలో ఆదివారం ఉద‌యం 7-30గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3గంట‌ల వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో 33 కెవి మరమ్మత్తుల కోసం విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్లు స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.