మహాత్మా బసవేశ్వర ఆశయసాధనకు కృషి చేయాలి
May 3, 2022
dharshininews
మహాత్మా బసవేశ్వర ఆశయసాధనకు కృషి చేయాలి
- బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహాత్మా బసవేశ్వర ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తాండూరు మున్సిఫ్ కోర్టు సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, బాలిశివ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర 889 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సమాజంలో ప్రజల మార్పు కోసం ఎన్ని సంస్కరణలు చేపట్టిన మహనీయుడు బసవేశ్వరుడు అని పేర్కొన్నారు. వీరశైవుల ఆరాధ్యదైవమైన బసవేశ్వరుడు సమాజ మార్పు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడని అన్నారు. కాయక మే కైలాసం అనే సిద్ధాంతం ద్వారా రా ప్రజలు చేపట్టిన వృత్తి దైవంగా భావించాలని పేర్కొన్నారని అన్నారు. అనుభవ మండపం 8 ద్వారా మహిళలకు సమాన హక్కులను కల్పించిన పుణ్య పురుషుడు అని కొనియాడారు. మహాత్మా బసవేశ్వర ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కార్యదర్శి రజిత, కోశాధికారి సుదర్శన్, న్యాయవాదులు రాంరెడ్డి, నర్సింగ్రావు, పాశం రవికుమార్, విశ్వనాధ్, శ్రవణ్ కుమార్, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, బి రవి కుమార్, ఆర్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.