schedule Friday, July 10, 2026

ఎస్సీ స్మశాన వాటిక పరిరక్షణకు కృషి

calendar_today May 22, 2022
person dharshininews
ఎస్సీ స్మశాన వాటిక పరిరక్షణకు కృషి
ఎస్సీ స్మశాన వాటిక పరిరక్షణకు కృషి - తీర్మానించిన ఎస్సీ కమ్యూనిటీ కార్యవర్గ సభ్యులు - అడ‌క్ క‌మిటి ఏర్పాటు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులోని ఎస్సీలకు స్మశాన వాటిక సాధన, పరిక్షణతో పాటు అభివృద్ధికి కృషి చేయాలని కమ్యూనిటీ కార్యవర్గ సభ్యులు తీర్మానించారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఎస్సీ కమ్యునిటీ కార్యవర్గ సభ్యులు సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో ఎస్సీ స్మశాన వాటిక సాధన, పరిరక్షణ అడక్ కమిటిని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎం.రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా నీరటి హన్మంతు, జె.నరేష్. ప్రధాన కార్యదర్శిగా ఎం.నవీన్, కోశాధికారిగా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.గోపాల్. డి. వెంకటేష్, సభ్యులుగా ఉదయ్ బాస్కర్, విజయ్, బలరాం. నరేష్, నర్సింలు, మోహన్, రమేష్, ఎం.గోపాల్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాత తాండూరులోని ఎస్సీలకు స్మశాన వాటిక లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఉన్న స్థలంలో వివాదాలతో కష్టాలను పడుతున్నామన్నారు. ఎస్సీలకు స్మశాన వాటిక సాధన, అభివృద్ధి, పరిరక్షణ జరగాలంటే అందరు ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, యువకులు పాల్గొన్నారు..