schedule Friday, July 10, 2026

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు న్యాయం

calendar_today May 23, 2022
person dharshininews
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు న్యాయం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు న్యాయం - రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ - టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహరాజ్ - తాండూరు మండలంలో జోరుగా మన ఊరు - మన కాంగ్రెస్ తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ న్యాయం జరుగుతుందని ఆ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ పేర్కొన్నారు. సోమవారం తాండూరు మండలంలోని నారాయణపూర్, గోనూర్, వీర్ శెట్టిపల్లి, ఎల్మకన్నె గ్రామాల్లో మన ఊరు- మన కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ పాల్గొని ప్రజలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమలు చేయబోతున్న వరంగల్ డిక్లరేషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోపిడి చేయడం.. మోసం చె యడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్‌ను పక్కాగా అమలు చేస్తామన్నారు. రైతులకు ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీని అమలు చేస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, వికారాబాద్ జిల్లా మహిళ అధ్యక్షురాలు శోభారాణి, సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్ధర్ రెడ్డి, వడ్ల నర్సింలు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్, మండల అధ్యక్షులు జగదీష్, నాయకులు వెంకటయ్య, గోపాల్ నాయక్, బస్వరాజ్, ఆయా గ్రామాల నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.