నమోః వరసిద్ధి వినాయకా..!
May 26, 2022
dharshininews
నమోః వరసిద్ధి వినాయకా..!
- వైభవంగా దేవాలయ వార్షికోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్‌లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాయలంలో వెలసిన వినాయకున్ని భక్తులు నమో వరసిద్ధి వినాయక అంటూ దర్శించుకున్నారు. గురువారం ఆలయంలో 12వ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, ధ్వజారోహణము, అభిషేకము, గణపతి హోమం, గీతా పారాయణము, పల్లకి సేవ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా దేవతా మూర్తులకు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహి వాంచారు. అదేవిధంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళ భక్తుల భజన కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వార్షికోత్సవ వేడుకల్లో పట్టణానికి చెందిన పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఆలయానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను సమర్పించింది..