schedule Saturday, September 12, 2026

అంకిత భావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు

calendar_today June 11, 2022
person dharshininews
అంకిత భావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు
అంకిత భావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు - తాండూరు రూరల్ సీఐ రాంబాబు - బ‌దిలీపై వెళ్లిన కానిస్టబుళ్ల‌కు స‌న్మానం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందని తాండూరు రూరల్ సీఐ రాంబాబు పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా కరణ్ కోట్ పోలీస్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు శ్రీనాథ్, ప్రశాంత్ రెడ్డిలు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా శనివారం పోలీస్టేషన్లో బదిలీపై వెళుతున్న కానిస్టేబుళ్లు శ్రీనాథ్, ప్రశాంత్ రెడ్డిలను రూరల్ సీఐ రాంబాబు సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఐదేళ్లు ఎలాంటి మచ్చ లేకుండా విధులు నిర్వహించడం ఆదర నీయమన్నారు. పోలీసులు అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. దానిని కొనసాగిస్తూ బదిలీపై ఎక్కడికి వెళ్లినా ఉన్నతమైన సేవలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరణ్ కోట్ ఎస్ఎస్ఐ మధుసూధన్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.