ఆదర్శ కుంట సమస్యకు పరిష్కారం
June 12, 2022
dharshininews
ఆదర్శ కుంట సమస్యకు పరిష్కారం
- పరిశీలించిన ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి ఆదర్శనగర్‌లో కుంట సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆదర్శనగర్ కుంటలోకి చేరిన మురుగు నీరు పారకపోవడంతో భారీ ఎత్తున నీరు నిలించింది. భారీ వర్షాలు పడితే నీరంతా ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డికి తెలపడంతో ఆమె విషయాన్ని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆదివారం ఆర్డీఓ అశోక్ కుమార్ కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల బాల్‌రెడ్డితో కలిసి ఆదర్శనగర్ కుంటను పరిశీలించారు. మరుగునీటి ప్రవాహానికి ఏయే అడ్డంకులు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కుంట సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

