విరజిమ్మిన మిషన్ భగీరథ
June 17, 2022
dharshininews
విరజిమ్మిన మిషన్ భగీరథ
- ఫౌంటేన్ లా ఉప్పొంగి నీరంతా వృధా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ నీరు విరజిమ్మింది. రోడ్డుపై ఉన్న వాల్ ను ఓ వాహనం ఢీకొనడంతో నీరంతా వృధాగా పారింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందిరా చౌరస్తా నుంచి లారీ పార్కింగ్ మార్గంలో ఉన్న సీసీ రోడ్డు కిందనుంచి మిషన్ భగీరథ పైపు లైన్ ఉంది. ఈ మార్గంలోనే వీరశైవ సమాజం నూతన కాంప్లెక్స్ ముందు ఉన్న మిషన్ భగీరథ వాల్ను అ మార్గంలో వెళుతున్న వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో వాల్ ధ్వంసమై నీరు ఎగిసి పడింది. భారీ ఎత్తున పైపైకి నీరంతా విరజిమ్మింది. ఫౌంటేన్ మాదిరిగా నీరంతా ఎగిసిపడింది. దాదాపు అరగంటకు పైగా నీరంతా వృధాగా పారింది. ఎగిసిన నీరును స్థానికులంతా ఆసక్తిగా తిలకించారు. వీడియోలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మిషన్ భగీరథ అధికారులకు తెలపడంతో నీటి సరఫరాను సృంభింప చేశారు. వాల్ కు మరమ్మత్తులు చేయించిన తరువాతే నీటి సరఫరాను పునరుద్దరించారు.
[playlist type="video" ids="9486"]

