schedule Friday, July 10, 2026

సమస్యల పరిష్కారంపై దృష్టి

calendar_today June 18, 2022
person dharshininews
సమస్యల పరిష్కారంపై దృష్టి
సమస్యల పరిష్కారంపై దృష్టి -తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సమస్యల పరిష్కారానికి దృష్టి సారించడం జరుగుతుందని తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ అన్నారు. శనివారం పట్టణ ప్రగతిలో భాగంగా ఆర్జీ అశోక్ కుమార్ 13వ వార్డు గ్రీన్ సిటి, 14, 16, 17, 12వ వార్డుల్లో పర్యటించారు. ఆయా వార్డుల్లో అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. అదేవిధంగా మురుగుకాలువలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వార్డులలో సమస్యల పరిష్కారానికి దృష్టిసారించడం జరుగుతుందన్నారు. కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి నిరంతరంగా చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఆర్డీఓ వెంట కౌన్సిలర్లు విజయదేవి. వరాల శ్రీనివాస్ రెడ్డి, సోమశ ఖర్. టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథం, పట్టణ ప్రగతి సూపర్ వైజర్ రమేష్, జవాన్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.