పోలీసుల సైకిల్ యాత్ర జోష్ ఫుల్..!
October 28, 2022
dharshininews
పోలీసుల సైకిల్ యాత్ర జోష్ ఫుల్..!
- తాండూరు నుంచి వికారాబాద్ వరకు
- ప్రారంభించిన తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా తాండూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర జోష్ ఫుల్ గా కొనసాగింది. శుక్రవారం తాండూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టారు. తాండూరు పట్టణంలో చేపట్టిన సైకిల్ యాత్రను తాండూరు డీఎస్పీ జి. శేఖర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమర వీరుల వారోత్సవం సందర్భంగా సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం తాండూరు పట్టణం నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రం వరకు ఈ ర్యాలీ ఉత్సహాంగా ముందుకు సాగింది. ఈ ర్యాలీలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐలు వేణుగోపాల్ గౌడ్, మధుసూధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, పలువురు యువకులు, పోలీసు సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు.