schedule Friday, July 10, 2026

ఖబడ్దార్ ఎంపీ అరవింద్

calendar_today November 19, 2022
person dharshininews
ఖబడ్దార్ ఎంపీ అరవింద్
ఖబడ్దార్ ఎంపీ అరవింద్ - ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తే ఊరుకోం - జాగృతి తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దత్తాత్రేయ తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాగృతి తాండూరు నియోజకవర్గ కన్వినర్ దత్తాత్రేయ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఖబడ్దార్ అంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితపై అభాండాలు వేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. కేసీఆర్ కుటుంబంపై మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. పసుపు బోర్డుపై దొంగ బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేసి గెలిచిన ఘనత ఎంపీ అరవింద్‌ది అని విమర్శించారు. ఇప్పటికైనా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తున్నారని, ఓ కళంకంగా మారుతున్నారని అన్నారు. కవితపై అనవసర ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవితకు అరవింద్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు.