బీసీ స్మశాన వాటికపై ఎందుకంత నిర్లక్ష్యం
November 23, 2022
dharshininews
బీసీ స్మశాన వాటికపై ఎందుకంత నిర్లక్ష్యం
- ఏండ్లయినా అభివృద్ధికి నోచక ఇబ్బందులు
- స్మశాన వాటికను వైకుంఠదామంగా తీర్చిదిద్దాలి
- బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
- మున్సిపల్ కార్యాలయం ముందు నాయకుల ఆందోళన
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల స్మశాన వాటికపై అధికారులు, పాలకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో వందల మంది బీసీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తాండూరు పట్టణం పోలీస్టేషన్ వెనుకాల ఉన్న బీసీ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, రాష్ట్ర నాయకులతో కలిసి తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బీసీ స్మశాన వాటిక దుస్థితిని తెలియజేస్తూ ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు రాజుకుమార్ మాట్లాడుతూ దేశంలో కరోనా తరువాత స్మశాన వాటికలు వైకుంఠదామాలుగా పురోగతి చెందుతుంటే తాండూరులో బీసీ స్మశాన వాటిక పై అధికారులు, పాలకులు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. నిధులు మంజూరైనా అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో స్మశాన వాటి దీనంగా తయారయ్యిందని అన్నారు. పిచ్చిమొక్కలు, మూత్ర విసర్జన కార్యకలాపాలతో దుర్గందంగా తయారైనా అధికారులు, పాలకులకు ఏమాత్రం పట్టింపులేక పోయిందని అన్నారు. అంత్యక్రియలకు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు. వెంటనే బీస్మీ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా మహిళ అధ్యక్షురాలు మధులతా శ్రీనివాస్ చారి, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకూర్‌లు మాట్లాడుతూ బీసీ స్మశాన వాటికను అన్ని హంగులతో అభివృద్ధి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బాలప్ప, బీజేపీ తాండూరు కన్వినర్ రజనీకాంత్, బీసీ కుల సంఘాలు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పరమేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, బోయ వాల్మీకి సమాజం నాయకులు భద్రు, రజక సంఘం నాయకులు పరమేష్, వడ్డెర సమాజం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు బలరాం, హన్మంతు, శ్రీనివాస్, రాము, టైలర్ రమేష్, శ్రీనివాస్, కిరణ్, బోయ రాధాకృష్ణ, తాండ్ర నరేష్, జుంటుపల్లి వెంకట్, అంబ్రేష్, ఇందూరు వెంకట్, గడ్డం వెంకటేష్, లక్ష్మణచారి, నరేందర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, బస్సు, మతీన్, బాస్కర్, బీసీ మహిళ అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, అనిత, విజయలక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు.