schedule Friday, July 10, 2026

దగాకోరు సర్కారు

calendar_today November 24, 2022
person dharshininews
దగాకోరు సర్కారు
దగాకోరు సర్కారు - రైతులను వేధిస్తే సహించేది లేదు - సమస్యలను వెంటనే పరిష్కరించాలి - ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద కాంగ్రెస్ నేతల నిరసన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం రైతులను అడుగుడునా దోపిడి చేస్తూ దగాకోరు సర్కారుగా మారిందని తాండూరు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు నియోజకవర్గ, పట్టణ శాఖ పార్టీ ఆధ్వర్యంలో గురువారం తాండూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనీయర్ నాయకులు జనార్దన్ రెడ్డి, ఎంఎ అలీం, బస్వరాజ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, నాయకులు ధరణి పోర్టల్, రైతు రుణమాఫీ, రైతు భీమా, పొడుభుముల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సర్కారు ధరణి పోర్టల్ ద్వారా రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. పోడు భూముల వ్యవహారాలతో భూములను లాక్కుని రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు బీమాలలో సరైన న్యాయం చేయడం లేదని అన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది అన్నారు. రైతన్నలను వేధించే సర్కారుకు చరమగీతం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.