schedule Friday, July 10, 2026

శబరి భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్‌

calendar_today December 2, 2022
person dharshininews
శబరి భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్‌
శబరి భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్‌ - బస్సులు అద్దెకిస్తామని ప్రకటన - నిబంధనలు ఏంటంటే..? వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: శబరి మళై వెళ్లే అయ్యప్ప స్వాములకు, భక్తులకు వికారాబాద్‌ ఆర్టీసీ సంస్థ గుడ్‌ న్యూస్ చెప్పింది. స్వామి దర్శనానికి వెళ్లే వారికి ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు వికారాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్ మహేష్‌ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 31లోపు బస్సును బుక్‌ చేసుకున్న వారికి 10శాతం రాయితీ కూడ ఉంటుందన్నారు. సూపర్ డిలక్స్ బస్సు బుక్ చేసుకుంటే 35 మందితో పాటు అదనంగా గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట వారు కూడ ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9866618714లకు సంప్రదించాలని సూచించారు. మరోవైపు వివాహాది శుభకార్యాలయకు కూడ ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు, ఆర్టీసీ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.