రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
December 26, 2022
dharshininews
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
- ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరు పట్టణంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి శివాజీ దొరస్తా వరకు నాలా పనులు, రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాల మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శివాజీ చౌక్, సిసిఐ కాలనీ, నెహ్రు గంజ్, చెన్ గేష్ పూర్, పాత తాండూరు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నట్లు వివరించారు. కావున ప్రజలు, విద్యుత్ వినియోగ దారులు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు