schedule Thursday, July 09, 2026

గంగమ్మ ఒడికి గణనాథుడు..!

calendar_today August 31, 2025
person dharshininews
గంగమ్మ ఒడికి గణనాథుడు..!
గంగమ్మ ఒడికి గణనాథుడు..! - భక్తిశ్రద్దలతో సాగసంపిన సాయిమేధా విద్యార్థులు - అలరించిన విద్యార్థుల ఆట పాటలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణపతి బస్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా.. జై బోలో గణేశ్‌ మహారాజ్‌కీ జై.. అంటూ నినాదాలు తాండూరులోని శ్రీ సాయిమేధా విద్యాలయ విద్యార్థులు మార్మోగించారు. ఆదివారం పాఠశాలలో ప్రతిష్టించిన గణనాథుడి నిమజ్జనోత్సవం కనులపండువగా సాగింది. పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గణేషునికి పూజలు నిర్వహించి వినాయకున్ని నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన ఊరేగింపుముందు విద్యార్థులు సంప్రదాయ భజన కీర్తనలు చేస్తూ ముందుకు సాగారు. పురవీధుల్లో గణేష్‌ శోభాయాత్ర ఆకట్టుకుంది. తాండూరులోని కాగ్నానది వద్దకు గణేషున్ని ఊరేగింపుగా తీసుకవెళ్లి మరోసారి గణనాథునికి పూజలు నిర్వహించి నిమజ్జనంతో గంగమ్మ ఒడిలోకి పంపారు. అంతకుముందు పాఠశాలలో వినాయక లడ్డూ వేలం జరిగింది. వేలంలో లడ్డూ దక్కించుకున్న రాఘవేందర్ రెడ్డిని ఊరేగింపుగా పంపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38271/