schedule Wednesday, September 09, 2026

రూ. 3లక్షల 1,116లకు లడ్డూ వేలం

calendar_today August 31, 2025
person dharshininews
రూ. 3లక్షల 1,116లకు లడ్డూ వేలం
రూ. 3లక్షల 1,116లకు లడ్డూ వేలం - దక్కించుకున్న చెన్మిళ్ల కుటుంబం - గౌరవంగా అందించిన సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వినాయక లడ్డూ వేలం ధర రికార్డుకు చేరుకుంటుంది. ఆదివారం జరిగిన లడ్డూల వేలం రూ. 1లక్షతో ప్రారంభమైన సంగతి తెలిసింది. ఆ తరువాత రూ. 2లక్షల 52వేలకు పలికింది. తాజాగా లడ్డూ వేలం మరో లక్షకు ఎగబాకింది. kvcs తాండూరు పట్టణంలోని కన్యాపాఠశాల వద్ద ఉన్న వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతించిన వినాయకుని లడ్డూ రూ. 3లక్షల 1వెయ్యి 116లు పలికింది. చెన్మిళ్ల మనిష్ కుమార్ అనే యువకుడు వినాయక లడ్డూను అత్యధికంగా వేలం పాడి దక్కించుకున్నారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు ఆయనకు గణేష్‌ లడ్డూను గౌరవంగా అందించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38273/