schedule Thursday, July 09, 2026

ఎన్టీఆర్ కాలనీలో వినాయక లడ్డూ వేలం

calendar_today August 31, 2025
person dharshininews
ఎన్టీఆర్ కాలనీలో వినాయక లడ్డూ వేలం
ఎన్టీఆర్ కాలనీలో వినాయక లడ్డూ వేలం - దక్కించుకున్న పటేల్ కిరణ్‌ కుమార్ కుటుంబం - గౌరవంగా అందించిన సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్‌ లడ్డూ ఎంతో పవిత్రం అయిందని, దానిని దక్కించుకోవడం అంతే అదృష్టం అని తాండూరు భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా మండపాలలో ప్రతిష్టించిన గణనాథుల వద్ద వినాయకుల లడ్డూల వేలం ఉత్సహాంగా జరిగింది. kvcs పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో సిద్ది వినాయక ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని లడ్డూ వేలం జరిగింది. ఈ వేలంలో పటేల్ కుమార్ కుటంబ సభ్యులు పోటీ పడ్డారు. వేలంలో అత్యధికంగా రూ. 61వేలకు దక్కించుకున్నారు. ఈసందర్బంగా పటేల్ కిరణ్‌ కుమార్ కుమారుడికి లడ్డూను అందించి సంప్రదాయంగా బ్యాండు బాజాలతో సాగనంపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు బాతుల వెంకటయ్య, బాతుల నాగేష్, కాలనీ పెద్దలు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38281/