schedule Tuesday, September 08, 2026

దర్నా కేసులపై రాద్దాంతం తగదు

calendar_today November 6, 2025
person dharshininews
దర్నా కేసులపై రాద్దాంతం తగదు
దర్నా కేసులపై రాద్దాంతం తగదు - చట్ట ప్రకారమే పోలీసుల చర్యలు - ఎమ్మెల్యే ద్వారా కేసుల వివాదంకు పరిష్కారం - తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరులో దర్నాపై నమోదు అయిన కేసుల నమోదు విషయంలో కొందరు రాద్దాంతం చేయడం తగదని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ దర్నా కేసుల విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కొందరు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం చేపట్టిన దర్నాకు ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని, పోలీసులకు కూడా సమాచారం లేదని అన్నారు. దర్నా కారణంగా రాకపోకలకు ఇబ్బందులు రావడంతో, ఆటంకాలు ఎదురు కావడంతో పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని అన్నారు. kvcs దీనిపై కొందరు రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అసత్య ప్రచారం చేయడం సరైన పద్దతి కాదన్నారు. బస్సు ప్రమాదాన్ని మానవీయ కోణంలో చూడాలని, దానిని రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఒక్కో మృతులకు రూ. 7లక్షల పరిహారం ఇప్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇప్పటికైనా రాద్దాంతాలు చేయడం మానుకోవాలన్నారు. కేసుల వివాదానికి త్వరలోనే ఎమ్మెల్యే మనోహర్ ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39469/