schedule Thursday, July 09, 2026

ఆధ్వాన్న రోడ్లతో ఆగమాగం..!

calendar_today November 7, 2025
person dharshininews
ఆధ్వాన్న రోడ్లతో ఆగమాగం..!
ఆధ్వాన్న రోడ్లతో ఆగమాగం..! - నత్త నడకన జాతీయ రోడ్డు పనులు - రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి - లేదంటే బీఆర్ఎస్ సడక్ బంద్ తప్పదు - తాండూరు మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని అధ్వాన్న రోడ్లతో ప్రజలు, వాహనాదారల జీవితాలు ఆగమాగం అవుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎస్. వీరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఓప్రకటనలో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా గుంతల మయంగా మారిన రోడ్లతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గుంతల వల్లనే చేవేళ్ల రోడ్డు ప్రమాద ఘటన అందరిని కలిచివేసిందని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి అద్వాన్నంగా మారిందని అన్నారు. kvcs తాండూరు మండలంలో చేపట్టిన జాతీయ రోడ్డు పనులు మూడేళ్ల క్రితమే మంజూరైనప్పటికీ పనులు నత్తనడకన జరుగుతున్నాయని అన్నారు. కొత్లాపూర్ రోడ్డు పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో పనులు నిదానంగా కొనసాగుతున్నాయని అన్నారు. ముందే గుంతల రోడ్లతో ప్రయాణికులు, ప్రజలు రాకపోకలు సాగించేందుకు జంకుతున్నారని అన్నారు. రోడ్ల మరమ్మత్తుల విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించాలని అన్నారు. జాతీయ రోడ్డు పనుల విషయంలో సంబంధిత అధికారులు పనులను వేగవంతం చేయాలన్నారు. ఈనెల 12వ తేదిలోపు అధికారుల, పాలకుల స్పందన రాకపోతే తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సడక్ బంద్ తప్పదని హెచ్చరించారు. 20వ తేదిలోపు సడక్ బంద్ ఎప్పుడైనా ఉండొచ్చని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39480/