schedule Tuesday, September 08, 2026

పేదల కోసం న్యాయ సేవలు..!

calendar_today November 9, 2025
person dharshininews
పేదల కోసం న్యాయ సేవలు..!
పేదల కోసం న్యాయ సేవలు..! - విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - తాండూరులో జాతీయ న్యాయ సేవల దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు అన్యాయం జరగకుండా ఉండుందుకు న్యాయ సేవలను అందించడం జరుగుతుందని తాండూరు న్యాయ స్థానం ప్యానల్ న్యాయవాదులు చంద్రశేఖర్, జిలాని, వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించరకుని తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని బీసీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు చట్టాల పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్యానల్ న్యాయవాదులు చంద్రశేఖర్, జిలాని, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ క్యాంపు ఒక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించడం అట్టడుగు వెనుకబడిన ప్రజలకు న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. kvcs 2022-25 మధ్యకాలంలో దేశంలో 44.22 లక్షల మందికి ఉచిత న్యాయం అందించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండి చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యాహక్కు చట్టం సమాచార హక్కు చట్టం ఫోక్సో యాక్ట్ బాల్య వివాహాల నిరోధక చట్టం బాల కార్మికుల నిరోధక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది ప్రేమ్ కుమార్ అరుణ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39500/